సీపీఐ 4వ రాష్ట్ర మహాసభలు.. లోగో ఆవిష్కరణ

TG: పేదలకు ప్రభుత్వ భూములను పంపిణీ చేయడం కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఆయన ఆదివారం హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డితో కలిసి సీపీఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర మహాసభల నేపథ్యంలో సీపీఐ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పార్టీ లక్ష్యాలు, విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్