TG: తీవ్ర శ్వాస సమస్యతో మృత్యువుతో పోరాడుతున్న మూడు రోజుల పసికందుకు ‘108’ సిబ్బంది పునర్జన్మ ప్రసాదించారు. చిన్నారి పరిస్థితి విషమించడంతో సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి సీపీఆర్ (CPR) చేశారు. నిమిషాల్లోనే ఆ బిడ్డ మళ్లీ ఊపిరి పీల్చుకోవడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. సమయస్ఫూర్తితో శిశువు ప్రాణాలు కాపాడిన అంబులెన్స్ సిబ్బందిని ప్రశంసిస్తున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో తాండూరులో జరిగింది.