క్రేన్‌లో సమస్య.. గాల్లో నిలిచిపోయిన స్కై డైనింగ్‌ రెస్టరంట్‌ (వీడియో)

కేరళలోని ఇడుక్కి జిల్లాలో శుక్రవారం అనాచల్‌లోని స్కై డైనింగ్ రెస్టారెంట్‌లో కొలికోడ్‌కు చెందిన ఓ కుటుంబం భోజనం చేస్తుండగా ఊహించని సంఘటన చోటుచేసుకుంది. సుమారు 150 అడుగుల ఎత్తులో ఉన్న క్రేన్ పనిచేయడం ఆగిపోవడంతో, ఇద్దరు చిన్నారులతో సహా తల్లిదండ్రులు రెండు గంటలకు పైగా గాల్లోనే ఉన్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రోప్‌ల సహాయంతో వారిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు. క్రేన్ హైడ్రాలిక్ సమస్య వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్