యూత్‌ఫుల్ క్రేజీ ఎంటర్టైనర్ 'ఈ నగరానికి ఏమైంది'కి సీక్వెల్‌గా వస్తున్న 'ఈNఈ' సినిమా నవంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, 8 ఏళ్లుగా ప్రేక్షకులు అడుగుతున్న ఈ సినిమా సిద్ధమైందని, స్నేహితుల మధ్య ఉండే అనుభూతినే మళ్లీ తీసుకురావాలనుకున్నామని, ఈ రీ-యూనియన్ ప్రేక్షకులకు ఇంటికి తిరిగి వచ్చిన అనుభూతిని కలిగిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు.