'సృష్టి' టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న కల్యాణి రిమాండ్ రిపోర్ట్‌లో మరిన్ని విషయాలు తెలిశాయి. అక్రమంగా ఈ దందాను కొనసాగిస్తున్న డాక్టర్ నమ్రత.. వచ్చిన సంపాదనలో కల్యాణికి వాటా ఇచ్చిందని, అలాగే క్లైంట్లను తీసుకొచ్చినందుకు కూడా భారీ విల్లా గిఫ్ట్‌గా ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. రాజస్థాన్ దంపతులకు శిశువును ఇవ్వడంతో వారు కల్యాణికి రూ.2 లక్షలు ఇచ్చినట్లు తేలింది.