క్రెడిట్ కార్డు లిమిట్ అనేది ఆదాయం, ఉద్యోగ స్వభావం, జాబ్ స్టెబిలిటీ, క్రెడిట్ స్కోర్ ఆధారంగా బ్యాంకులు నిర్ణయిస్తాయి. క్రెడిట్ స్కోర్ బాగుంటే అధిక లిమిట్ తో పాటు తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తాయి. కార్డు లిమిట్‌లో 30 శాతం మాత్రమే వాడాలని, బిల్లులను సకాలంలో చెల్లించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. బాధ్యతాయుతంగా వాడితే క్రెడిట్ కార్డు ఆర్థిక స్థాయిని పెంచుతుంది.