దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డుల వినియోగం వేగంగా పెరుగుతోంది. కేర్ రేటింగ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, సెప్టెంబర్‌లో క్రెడిట్ కార్డు ఖర్చులు 23% వృద్ధితో రూ. 2.17 లక్షల కోట్లకు చేరాయి. ఆగష్టుతో పోల్చితే 13% పెరిగింది. 2020 తర్వాత ఇంత భారీ ఖర్చు ఇదే తొలిసారి. పండుగ సీజన్ గిరాకీ, జీఎస్టీ సంస్కరణలు, బ్యాంకులు, ఆన్‌లైన్ ఆఫర్లు వృద్ధికి కారణమని నివేదిక తెలిపింది. అలాగే క్రెడిట్ కార్డుల సంఖ్య 10.6 కోట్ల నుంచి 11.3 కోట్లకు పెరిగిందని స్పష్టం చేసింది.