రాజకీయాల్లోకి క్రికెటర్ షమీ?

టీమ్ ఇండియా బౌలర్ మహ్మద్ షమీ రాజకీయాల్లోకి రానున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆయన రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) చీఫ్ జయంత్ చౌదరీతో సమావేశమయ్యారు. దీంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది. అయితే వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమ్రోహా నియోజకవర్గం నుంచి షమీ పోటీ చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. జయంత్ చౌదరీతో భేటీకి గల కారణాలు తెలిస్తేనే ఆయన రాజకీయ ప్రవేశంపై స్పష్టత రానుంది.

సంబంధిత పోస్ట్

✕
✕