సీఎం విజ‌య్ లండ‌న్ ప‌ర్య‌ట‌న‌పై విమ‌ర్శ‌లు

తమిళనాడు సీఎం విజయ్‌ లండన్‌ పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే పర్యటన లక్ష్యమని విజయ్‌ పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఆయన కార్‌ రేసింగ్‌ వీక్షించడం, నటుడు అజిత్‌ను కలవడంపై ఏఐఏడీఎంకే, బీజేపీ నేతలు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజాధనంతో వ్యక్తిగత పర్యటన చేస్తున్నారా, పెట్టుబడుల కోసమే వెళ్లారా స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. విజయ్‌ లండన్‌ పర్యటనను విహారయాత్రగా బీజేపీ నేతలు అభివర్ణించారు. అయితే పెట్టుబడిదారులతో విజయ్‌ చర్చలు జరుపుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕