హైదరాబాద్‌లోని చైతన్యపురి మూసీ నదీ పరివాహక ప్రాంతంలో మొసలి స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఫణిగిరి కాలనీలోని శివాలయం వద్ద మొసలి కనిపించినట్లు స్థానికులు తెలిపారు. గత రెండు రోజుల నుంచి అదే ప్రాంతంలో సంచరిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు.