జింబాబ్వేలోని ప్రసిద్ధ విక్టోరియా జలపాతం సమీపంలోని ఓ హోటల్‌లో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున భారీ మొసలి అకస్మాత్తుగా హోటల్ వంటగదిలోకి చొరబడింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వంటగదిలో మొసలిని చూసి సిబ్బంది వెంటనే అప్రమత్తమై భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం అధికారులు అక్కడికి చేరుకుని జాగ్రత్తగా ఆ మొసలిని పట్టుకుని సురక్షితంగా తిరిగి అడవిలో విడిచిపెట్టారు. ఈ ఘటనతో హోటల్‌లో కొద్దిసేపు భయాందోళన నెలకొంది.