పంట మార్పిడి, యూరియా తగ్గింపు తప్పనిసరి అంటున్న శాస్త్రవేత్తలు

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని రైతువేదికలో 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. సి.హెచ్.పల్లవి రైతులకు పలు సూచనులు చేశారు. వానాకాలం సాగులో పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలని, యూరియా వాడకాన్ని తగ్గించాలన్నారు.   సాగు ఖర్చు తగ్గించుకోవడానికి, నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి, స్థిర ఆదాయం పొందడానికి ఈ పద్ధతులు పాటించాలని ఆమె రైతులకు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్