చైనా మంజాకు చిక్కుకున్న కాకి (వీడియో)

చైనా మాంజాతో గాలిపటాలు ఎగరవేస్తే చర్యలు తప్పవని పోలీసులు ఎంత హెచ్చరించినా కొందరు పెడచెవినపెడుతున్నారు. కరీంనగర్ బస్టాండ్ వద్ద ఓ కాకి చైనా మంజాకు చిక్కుకుపోయింది. కాళ్లకు దారం చుట్టుకుపోవడంతో చాలా సేపు విలవిలలాడింది. అయితే సమాచారం అందుకున్న కరీంనగర్ బ్లూ క్రాస్ ఇంఛార్జ్ నారాయణ బస్సుపై ఎక్కి కాకి కాళ్లకు చిక్కుకున్న దారాన్ని తొలగించడంతో అది ఎగిరిపోయింది.

సంబంధిత పోస్ట్