మేడారంలో భక్తుల రద్దీ (వీడియో)

TG: తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గద్దెల లోపలికి భక్తుల అనుమతిని పోలీసులు నిలిపివేశారు. గ్రిల్స్ బయటి నుంచే దర్శనాలు జరుగుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వస్తుండడంతో పలు మార్గాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జంపన్న వాగు వద్ద తప్పిపోయిన ఓ పాపను మంత్రి సీతక్క చేరదీసి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు పంపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్