తిరుమలలో భక్తుల రద్దీ.. వీఐపీ దర్శనాలు రద్దు

AP: వీకెండ్ కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భారీ రద్దీతో క్యూలైన్లు శిలాతోరణం వరకు చేరడంతో, టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24-26 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో, టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం వీఐపీ, శ్రీవాణి దర్శనాలను రద్దు చేసింది. వీఐపీ దర్శనాలకు బ్రేక్ వేయడంతో ఆదివారం సిఫార్సు లేఖలను తీసుకోవడంలేదు. వెబ్ సైట్‌లో తక్షణమే ఇచ్చే 800 టికెట్లను కూడా జారీ చేయడంలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్