తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య తక్కువగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు కేవలం 4 గంటల్లోనే దర్శనం లభిస్తోంది. రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్ తీసుకున్న వారికి వేచి ఉండాల్సిన అవసరం లేదు. బుధవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 4 కంపార్టుమెంట్లలోనే భక్తులు ఉన్నారు. మంగళవారం 64,684 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు, 20,515 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.75 కోట్లుగా నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్