తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం డైరెక్ట్ లైన్‌లోనే భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. నిన్న శ్రీవారిని 60,581 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,228 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.04 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.