తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ పెరగడంతో.. బుధవారం జారీ చేయాల్సిన ఎస్‌ఎస్‌డీ టోకెన్లను రద్దు చేశారు. గురువారం దర్శనానికిగాను శుక్రవారం మధ్యాహ్నం నుంచి యథావిధిగా టోకెన్లు జారీ చేస్తారు. ఇది వరుసగా నాలుగో వారం టోకెన్లు రద్దు కావడం, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం దర్శనాలకు మంగళవారం వేకువజామునే టోకెన్లు జారీ చేసినా, గంటలోపే కోటా పూర్తవడంతో చాలామంది భక్తులు నిరీక్షించాల్సి వచ్చింది. సర్వదర్శన టోకెన్లు జారీ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.