ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Crude Oil) ధరలు మళ్లీ పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర శనివారం $3.94 పెరిగి $109.86కు చేరింది. కాగా మే నెల తర్వాత ముడిచమురు ధరలు ఈ స్థాయిని తాకడం ఇదే తొలిసారి. దీంతో భారత కంపెనీలు దిగుమతి చేసుకునే క్రూడాయిల్ బ్యారెల్ ధర 122.01 డాలర్లకు ఎగసింది. ఇది SEP యావరేజ్($116.09)తో పోలిస్తే గణనీయంగా పెరిగింది. సౌదీ అరేబియాపై హౌతీలు, రష్యా, ఉక్రెయిన్ పరస్పరం దాడులు అంతర్జాతీయంగా చమురు సరఫరాపై ఒత్తిడిని పెంచుతున్నాయి.