క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం.. వారం రోజుల్లో 10 డాలర్ల పతనం

క్రూడాయిల్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నెల 15న బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 108 డాలర్లు దాటగా, ప్రస్తుతం 97.56 డాలర్లకు పడిపోయింది. వారం రోజుల్లోనే 10 డాలర్ల మేర ధర తగ్గింది. సౌదీ అరేబియా తమ ఈస్ట్ వెస్ట్ ఆయిల్ పైప్‌లైన్‌ను తిరిగి ప్రారంభించడం, ఎర్ర సముద్రంలో ఎగుమతులు పునఃప్రారంభం కావడంతో ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. WTI క్రూడ్ ధర కూడా 89.38 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్

✕
✕