ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ధర దాదాపు 6 శాతం తగ్గి బ్యారెల్‌కు 88.3 డాలర్లకు చేరుకోగా, బ్రెంట్ క్రూడ్ 93 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మే నెలలోనే చమురు ధరలు 16 నుంచి 18 శాతం వరకు తగ్గాయి. హోర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా పునరుద్ధరణకు ఇరాన్ అంగీకరించడంతో మార్కెట్‌లో ఊరట కనిపించింది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గం మళ్లీ తెరుచుకోవడంతో ధరలు మరింత తగ్గే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.