VIDEO: 13 ఏళ్ల బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో వివాహం

TG: రంగారెడ్డి జిల్లా నందిగామలో 13ఏళ్ల బాలికకు 40ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నందిగామకు చెందిన ఎనిమిదో తరగతి బాలికను కందివాడకు చెందిన శ్రీనివాస్‌గౌడ్‌ (40)తో మే నెల 28న స్థానిక ఆలయంలో వివాహం చేశారు. ఇటీవల బాలిక ఉపాధ్యాయులకు ఈ విషయం తెలియజేయగా.. వారి సమాచారం మేరకు పోలీసులు బుధవారం బాలిక తల్లి, వరుడు, పురోహితుడు, మధ్యవర్తిపై కేసు నమోదు చేశారు. బాలికను సఖీ కేంద్రానికి తరలించారు.

సంబంధిత పోస్ట్