AP: అరకు ప్రాంతానికి చెందిన దివ్య స్వరూప, జాన్‌బాబు ప్రేమ వివాహం చేసుకోగా.. తండ్రి శుక్రకు అది ఇష్టం లేదు. దీంతో గర్భిణీగా ఉన్న కూతురుని విశాఖకు తీసుకువచ్చి ప్రసవం జరిపించాడు. అనంతరం శిశువుకు బాలేదని చెప్పి పత్రాలపై సంతకాలు తీసుకొని, దత్తత పేరుతో వేరొకరికి అప్పగించాడు. 2 నెలలుగా బాబు కనిపించకపోవడంతో దివ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు చేపట్టి పోలీసులు బిడ్డను శిశుగృహకు అప్పగించారు.