దారుణం.. భార్యను చున్నీతో ఉరివేసి చంపిన భర్త

TG: హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ PS పరిధిలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను చున్నీతో ఉరివేసి చంపి.. ఆ తర్వాత భర్త పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. తూ.గో. జిల్లా కొమ్మనపల్లికి చెందిన మరియాదాస్‌, అమృత మూడేళ్లుగా సరూర్‌నగర్‌లో ఉంటున్నారు. వివాహేతర సంబంధం కారణంగా వారి మధ్య గొడవలు జరిగేవి. ఇటీవల ఫోన్‌ మాట్లాడే విషయంలో వారి మధ్య వివాదం నెలకొంది. దాంతో భర్త మరియాదాస్‌ భార్య అమృతను చున్నీతో ఉరివేసి చంపాడు.

సంబంధిత పోస్ట్