దారుణం.. అనుమానంతో భార్యను చంపేసిన భర్త

AP: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో దారుణం జరిగింది. వేలూరు గ్రామానికి చెందిన సాల్మన్ రాజు, పుష్ప దంపతులు. భార్యపై అనుమానం పెంచుకున్న సాల్మన్ రాజు మద్యానికి బానిసయ్యాడు. తరచూ భార్యతో గొడవపడేవాడు. భార్యను వదిలించుకోవాలని సాల్మన్ రాజు ప్లాన్ చేశాడు. పుష్ప నిద్రపోతున్నప్పుడు రోకలి బండతో దారుణంగా కొట్టాడు. పుష్పను గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి సాల్మన్ రాజును అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్