భర్తను వదిలించుకోవాలని నెలల శిశువును బావిలో పడేసింది ఓ తల్లి. ఈ అమానుష ఘటన యూపీలోని లఖింపూర్ ఖేరి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున ఎవరికీ తెలియకుండా కుసుమ అనే మహిళ తన పాపను ఇంటి దగ్గర్లో ఉన్న బావిలో పడేసింది. ఆమె భర్త ధూప్ సింగ్ భార్య, పాప కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. గాలింపు చేపట్టిన పోలీసులు కుసుమను అదుపులోకి తీసుకోగా నేరాన్ని అంగీకరించింది.