దారుణం.. ఆడపిల్లను కని ముళ్లపొదల్లో పారేసిన తల్లి

TG: నారాయణపేట జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పుట్టిన వెంటనే ఆడబిడ్డను తల్లి ముళ్లపొదల్లో పడేయడంతో పసికందు మృతి చెందింది. అప్పక్‌పల్లికి చెందిన భారతి నవంబర్ 24న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. భర్తకు బిడ్డ చనిపోయిందని అబద్ధం చెప్పింది. నిలదీయగా చెత్తకుప్పలో పడేసినట్టు ఒప్పుకుంది. వెంటనే భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆదివారం ముళ్లపొదల్లో శిశువును కనుగొన్నారు. బిడ్డను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్