హైదరాబాద్ లంగర్‌హౌస్‌లో జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. సయ్యద్ జుబేది(44) అనే వ్యక్తి ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. వారిలో ఒకరు చనిపోగా, మరో భార్య విడాకులు తీసుకుంది. 2019లో ఇఫాతియా బేగంను మరో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు అప్పటికే ఇద్దరు కుమార్తెలు. ఇఫాతియాతో పెళ్లయ్యాక ఆమె ఇద్దరు కుమార్తెలపై సయ్యద్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లికి బాలికలు విషయం చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.