దారుణం.. మేనత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు

TG: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని మేనత్తను అల్లుడు గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(M) ఇప్పలగూడెంలో జరిగింది. మేనత్త కొండగొర్ల ఎల్లమ్మ(50)ను మేనల్లుడు విజయ్ కుమార్ మద్యం మత్తులో గొడ్డలితో నరికి చంపాడు. జల్సాలు, మద్యానికి బానిసైన విజయ్ డబ్బులు ఇవ్వాలని మేనత్తను డిమాండ్ చేయగా ఆమె నిరాకరించడంతో ఇంతటి కిరాతకానికి ఒడిగట్టాడు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

సంబంధిత పోస్ట్