దారుణం.. బాలుడి ప్యాంట్‌లో తేలును వదిలిన టీచర్

హిమాచల్ ప్రదేశ్‌లోని శిమ్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలుడిని పదేపదే కొట్టడమే కాకుండా, ఉపాధ్యాయులు అతని ప్యాంట్‌లో తేలును వదిలిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు ప్రధానోపాధ్యాయుడు దేవేంద్ర, ఉపాధ్యాయులు బాబురామ్‌, కృతికా ఠాకూర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడాదిగా బాలుడిపై శారీరక వేధింపులు కొనసాగుతున్నాయని, ఇంట్లో వాళ్లకు చెప్తే బడి నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారని బాలుడి తండ్రి ఆరోపించారు.

సంబంధిత పోస్ట్