TG: సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆర్వపల్లి మండలం కొత్తగూడలో ఏడాది చిన్నారి భవిజ్ఞను తండ్రి వెంకటేష్ హతమార్చాడు. మద్యం మత్తులో భార్య నాగమణితో వెంకటేష్ గొడవ పడ్డాడు. ఆ సమయంలో తన ఏడాది చిన్నారి ఏడుస్తోందని నేలకేసి కొట్టాడు. దీంతో కొన ఊపిరితో ఉన్న చిన్నారిని బంధువులు ఆస్పత్రికి తరలించారు. అయితే తలకు బలమైన దెబ్బ తగలడంతో పరిస్థితి విషమించి భవిజ్ఞ మరణించింది.