AP: పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలం వేలూరులో అనుమానంతో భార్యను భర్త అతికిరాతకంగా హత్య చేశాడు. సాల్మన్ రాజు, భార్య పుష్పపై అనుమానం పెంచుకున్నాడు. దంపతుల మధ్య పెళ్లైనప్పటి నుంచి గొడవలు జరుగుతుండేవి. గత రాత్రి కూడా ఇదే విషయంలో ఘర్షణ జరగడంతో, కోపంతో ఊగిపోయిన భర్త సాల్మన్ రాజు రోకలి బండతో భార్య పుష్పను కొట్టి చంపాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.