దారుణం.. 3 నెలల గర్భిణిని చంపిన భర్త

TG: ములుగు జిల్లా ఏటూరునాగారంలోని 3వ వార్డుకు చెందిన గుండారపు భవాని (30) భర్త చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో భర్త ఏఆర్ కానిస్టేబుల్ అయిన బోడా నరేందర్ భవానిని హత్య చేసి, మృతదేహాన్ని గోనె సంచిలో మూటగట్టి గోదావరిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గతంలో వీరికి పుట్టిన చిన్నారి అనారోగ్యంతో మృతిచెందగా, ప్రస్తుతం భవాని 3 నెలల గర్భిణి అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕