దారుణం.. రెండ్రోజులుగా గదిలోనే తల్లి, కుమారుడి మృతదేహాలు

TG: హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్‌ సమీపంలో లాలాపేటలోని ఓ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గది తలుపులు తెరిచి చూడగా తల్లి, కుమారుడి మృతదేహాలు కనిపించాయి. ఈ ఘటన రెండ్రోజుల క్రితం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్