TG: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. కొమురం భీం జిల్లా బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామంలో దారుణం జరిగింది. బీఆర్ఎస్ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి ధరావత్ మహేష్‌కు చెందిన పంటను గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. వారం రోజులుగా ప్రచార పనుల్లో ఉన్న మహేష్‌ను ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో అతనికి చెందిన రెండు ఎకరాల పంటకు దుండగులు నిప్పు పెట్టినట్లు సమాచారం. మంటల్లో పంట పూర్తిగా దగ్ధమై భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది.