సాంకేతికతపై నమ్మకంతో కొందరు శరీరాలను, మెదడును అత్యాధునిక క్రయోజెనిక్స్ చాంబర్లలో మైనస్ 196 డిగ్రీల సెల్సియస్ వద్ద లిక్విడ్ నైట్రోజన్‌లో గడ్డకట్టించి భవిష్యత్తులో పునరుజ్జీవనం పొందాలని ఆశిస్తున్నారు. ఈ ప్రక్రియలో కణజాలం పాడవకుండా, శరీరాన్ని 'కాలం నిలిపిన' స్థితిలో భద్రపరుస్తారు. పూర్తి శరీరం భద్రపర్చడానికి రూ.1.60 కోట్ల నుంచి రూ.2.50 కోట్ల వరకు, మెదడుకు రూ.కోటిన్నరకు పైగా ఖర్చవుతుంది. అమెరికా, రష్యా ఈ రంగంలో ముందున్నాయి. అయితే, కాలిఫోర్నియా వర్సిటీ అధ్యయనం ప్రకారం, మెదడును గడ్డకట్టించిన తర్వాత జ్ఞాపకాలు, నాడి సంబంధాలు పూర్తిస్థాయిలో తిరిగి పనిచేయడం సాధ్యం కాదని, పూర్తి మానవశరీర పునరుద్ధరణ ఇంకా సాధ్యం కాలేదని తెలుస్తోంది.