గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదో వికెట్‌ను కోల్పోయింది. 15.3 ఓవర్లలో 96 పరుగుల వద్ద శివమ్ దూబే (22) అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు క్యాచ్ డ్రాప్ అయినా, దూబే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో సీఎస్‌కే 16 ఓవర్లకు 102/5 స్కోరుతో కొనసాగుతోంది. క్రీజ్‌లో రుతురాజ్ (48*) కార్తిక్ శర్మ (6*) ఉన్నారు.