మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడంతో అధిక బరువు, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. వీటికి పరిష్కారంగా, మన వంటగదిలోనే లభించే వాము-జీలకర్ర నీరు అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. వాము జీర్ణక్రియను మెరుగుపరిచి, మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు ఉండి, కొవ్వు జీవక్రియను వేగవంతం చేసి, కేలరీలను కరిగించడంలో సహాయపడుతుంది. ఒక టీస్పూన్ వాము, ఒక టీస్పూన్ జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం వడకట్టి గోరువెచ్చగా లేదా నేరుగా తాగాలి. పరగడుపున తాగితే ఉత్తమ ఫలితాలుంటాయి.