పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే వర్షాకాలంలో దీనిని తినే సమయం, పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆహార నిపుణుల ప్రకారం.. వర్షాకాలంలో పెరుగును మధ్యాహ్న సమయంలో తీసుకోవడం ఉత్తమం. ఈ సమయంలో జీర్ణశక్తి బాగా పనిచేస్తుంది. దీనివల్ల పెరుగులోని పోషకాలు సులభంగా శోషించబడతాయి. పెరుగును సుగంధ ద్రవ్యాలతో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి వెచ్చదనం ఇస్తుంది. అలాగే చక్కెర లేదా బెల్లం కలిపి తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.