ఢిల్లీలో జరిగే ఇండియా కూటమి రామ్‌లీలా మార్చ్‌లో పాల్గొనడంతో పాటు స్థానిక చిన్న వ్యాపారులకు అండగా నిలవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీపావళి, ఛత్ పూజ, భాయ్ దూజ్ పండుగల సందర్భంగా ఢిల్లీకి వచ్చే ప్రజలు స్థానిక దుకాణాల్లో షాపింగ్ చేయాలని సూచించారు. నిరసనలు, ర్యాలీల్లో పాల్గొంటూనే పండుగ కొనుగోళ్లు కూడా చేయవచ్చని తెలిపారు. ర్యాలీల వల్ల వ్యాపారులకు నష్టం జరుగుతుందంటూ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ప్రజలు నిరసనల్లో పాల్గొంటూనే చిన్న వ్యాపారులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా కోరారు.