కరెంట్ కష్టాలు.. భారత్ సహకారం కోరిన బంగ్లాదేశ్‌

బంగ్లాదేశ్‌ తీవ్ర విద్యుత్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 9–10 గంటల విద్యుత్‌ కోతలు అమలవుతున్నాయి. విద్యుత్‌ పొదుపులో భాగంగా రాత్రి 8 గంటలకే షాపింగ్‌ మాల్స్‌, దుకాణాలు, మార్కెట్లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దేశంలో విద్యుత్‌ డిమాండ్‌ 18,000 మెగావాట్లకు చేరగా.. సరఫరా 13,000 మెగావాట్లకే పరిమితమైంది. సహజవాయువు కొరతతో సుమారు 1,500 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. ఎల్‌ఎన్‌జీ సరఫరాలో అంతరాయం, ప్రతికూల వాతావరణం సంక్షోభాన్ని మరింత తీవ్రం చేశాయి. ఈ నేపథ్యంలో అదనపు డీజిల్‌ సరఫరా చేయాలని బంగ్లాదేశ్‌ భారత్‌ను కోరింది.

సంబంధిత పోస్ట్