తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర నూతన DGPగా సీవీ ఆనంద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారి చేసింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీవీ ఆనంద్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 1991 IPS బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ ప్రస్తుతం హోం సెక్రెటరీగా పని చేస్తున్నారు.