హైదరాబాద్‌లో కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. సైబర్ నేరగాడి బారినపడి ఆర్థికంగా మోసపోయిన అనూష బలవన్మరణానికి పాల్పడింది. అనూషకు వర్క్ ఫ్రంహోమ్ ఇప్పిస్తానని ఓ సైబర్ నేరగాడు నమ్మించి మోసం చేశాడు. దాంతో ఆమె సుమారు రూ.లక్ష నగదు పోగొట్టుకుంది. ఈ క్రమంలో మనస్తాపంతో అనూష ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.