సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ మహేందర్‌ అరెస్ట్

TG: సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ మహేందర్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్టు చేసింది. ఓ కేసులో కుటుంబసభ్యుల పేర్లు చేర్చకుండా ఉండేందుకు రూ.9 లక్షలు డిమాండ్​ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేందర్​ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గతంలో రూ.5 లక్షలు తీసుకున్న మహేందర్​, మిగిలిన నగదు కోసం డిమాండ్​ చేయడంతో బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో అతడి ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు రూ.13 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, ఇతర స్థిరాస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్