సైబర్‌కాండ్రియా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏటా ట్రిలియన్ డాలర్లకుపైగా నష్టం వాటిల్లుతోందని అంతర్జాతీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి. కోవిడ్-19 మహమ్మారి తర్వాత చిన్న ఆరోగ్య సమస్యలను తీవ్రమైన వ్యాధులుగా అనుమానించడం, తరచూ వైద్య పరీక్షలు, వైద్యుల మార్పు వంటి లక్షణాలు పెరిగాయి. భారత్‌లోనూ కోవిడ్ కాలం నుంచి సైబర్‌కాండ్రియా కేసులు గణనీయంగా పెరిగాయి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఇంటర్నెట్ సమాచారాన్ని పరిమితంగా వాడటం, విశ్వసనీయ వనరులతో నిర్ధారించుకోవడం, ఆరోగ్య సమస్యలపై నేరుగా వైద్యులను సంప్రదించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.