సైబర్ క్రైమ్ సమాజానికి పెను ముప్పు: సీఎం రేవంత్

TG: సైబర్ క్రైమ్ సమాజానికి పెను ముప్పు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారో తప్పనిసరిగా గమనించాలని ఆయన సూచించారు. పిల్లల చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీయవచ్చని ఆయన అన్నారు. పిల్లలు సైబర్ క్రైమ్ బారిన పడకుండా SHE-భరోసా సైబర్ ల్యాబ్‌లు పని చేస్తున్నాయని, CybHER యాప్ ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు సీఎం వివరించారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సౌత్ జోన్ రీజినల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొని సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕