ఇన్సూరెన్స్ పేరుతో రూ.7 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాడు అరెస్ట్

హైదరాబాద్ పోలీసులు ఇన్సూరెన్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌కు చెందిన శరద్ గార్గ్‌ను అరెస్ట్ చేశారు. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, ఆక్సిస్ బ్యాంక్ అధికారిగా నటిస్తూ, ఇన్సూరెన్స్ ఇప్పిస్తానని చెప్పి బాధితుల నుంచి రూ6.45 లక్షల కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఆరుగురు బాధితులు ఉండగా, వారిలో ఒకరు తెలంగాణకు చెందినవారు. నిందితుడి నుంచి మూడు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, చెక్‌బుక్స్, షెల్ కంపెనీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్