అర్నబ్ తుఫాన్ ఏపీలో తీరం దాటింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం దగ్గర తీరం దాటి క్రమంగా బలహీనపడుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో వాతావరణం చల్లబడింది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పలుచోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. హైదరాబాద్, సిద్దిపేట జిల్లాల సహా పలు జిల్లాల్లో చల్లని గాలులు వీస్తున్నాయి.