శ్రీలంకలో 'దిత్వా' తుఫాన్ కారణంగా భారీ విధ్వంసం సంభవించింది. ఇళ్లు కూలిపోవడం, పట్టణాలు జలమయం కావడం, కొండచరియలు విరిగిపడటంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. శ్రీలంక విపత్తు నిర్వహణ కేంద్రం ప్రకారం.. ఇప్పటివరకు 334 మంది మరణించగా, 370 మంది ఆచూకీ గల్లంతయింది. ఈ సంక్షోభంలో భారత దేశం 'ఆపరేషన్ సాగర్ బంధు'తో సహాయం అందిస్తోంది. కొలంబో నుంచి 323 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. వరదల్లో చిక్కుకున్న 45 మంది భారతీయులను భారత వాయుసేన కొలంబోకు తరలించింది.