ఏపీలో తుఫాన్ బీభత్సం.. ఐదుగురు మృతి

ఏపీని అతలాకుతలం చేస్తున్న 'అర్నబ్' తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వేర్వేరు ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. భీమవరంలో చెట్టు పడి కిషోర్ (48), విశాఖలో విద్యుత్ తీగలు తెగిపడటంతో దేవుడు (65), బాలాజీనగర్ లో విద్యుత్ స్తంభం పడి మాధవి మరణించారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో భాగ్యలక్ష్మి (55) కరెంట్ షాక్ తో, కోనసీమలోని సఖినేటిపల్లిలో వర్షానికి గుడిసె కూలి వెంకాయమ్మ ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి.

సంబంధిత పోస్ట్

✕
✕